: రద్దయిన 174 ఇంజినీరింగ్ కాలేజీల్లో ఎక్కువ శాతం టీఆర్ఎస్ మద్దతుదారులవే


సరైన విద్యా ప్రమాణాలు పాటించడం లేదని ఇటీవల 174 ఇంజినీరింగ్ కాలేజీల గుర్తింపును రద్దు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఓ చిక్కు వచ్చి పడింది. ఈ 174 ఇంజినీరింగ్ కాలేజీలలో చాలా వరకు టీఆర్ఎస్ మద్దతుదారులు, నాయకులవే ఉన్నాయని సమాచారం. ఇంకో విచిత్రం ఏమిటంటే, మిగతా పార్టీల నాయకుల భాగస్వామ్యం ఉన్న చాలా కాలేజీలు ఏఐసీటీఈ ప్రమాణాలు పాటిస్తూ... తమ గుర్తింపును కాపాడుకున్నాయి. ప్రభుత్వంలోని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... ఉన్నతవిద్యామండలి గుర్తింపు రద్దు చేసిన కాలేజీల్లో తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డికి చెందిన ఇంజినీరింగ్ కాలేజీలు మూడు ఉన్నాయి. అలాగే కరీంనగర్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి చెందిన రెండు ఇంజినీరింగ్ కాలేజీల గుర్తింపును ఉన్నతవిద్యామండలి రద్దు చేసింది. వీరిరువురిలాగే చాలా మంది టీఆర్ఎస్ మద్దతుదారుల కాలేజీలు విద్యాప్రమాణాల పాటించని కారణంగా గుర్తింపును కోల్పోయాయి. కొసమెరుపు ఏమిటంటే... మల్కాజ్ గిరి ఎంపీ మల్లారెడ్డికి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 15 ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఇవన్నీ సరైన ప్రమాణాలు పాటిస్తూ... తమ గుర్తింపును కాపాడుకున్నాయి. ప్రభుత్వ గుర్తింపు కోల్పోయిన 174 కాలేజీల్లో... దాదాపు 150 కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వ నిర్ణయాన్ని ఛాలెంజ్ చేస్తూ... ఇప్పటికే కోర్టును ఆశ్రయించాయి.

  • Loading...

More Telugu News