: ప్రాక్టీస్ మ్యాచ్ లో గట్టెక్కిన భారత్


వన్డే సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మిడిలెక్స్ తో టీమిండియా ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. ఇందులో విజయం సాధించినప్పటికీ, ఆట తీరు పరంగా మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ద్వితీయ శ్రేణి జట్టు చేతిలో 44.2 ఓవర్లలో 230 పరుగులకే ఆలౌటైంది. వన్డే మ్యాచ్ ల కోసం జట్టుతో చేరిన తెలుగు తేజం అంబటి రాయుడు (72) రాణించగా, ఫాం కోల్పోయి, లవర్ ను వెంట తెచ్చుకుని నానా తంటాలు పడుతున్న కోహ్లీ (71) కాస్త రాణించాడు. మిగిలిన వారెవరూ పెద్దగా ప్రభావం చూపలేదు. మిడిలెక్స్ బౌలర్లలో రేనర్ 4, పటేల్ 2, సంధు, హారిస్ తలో వికెట్ తీశారు. కాగా మిడిలెక్స్ బ్యాట్స్ మన్ భారత బౌలర్లను ఎదుర్కోలేకపోయారు. కరణ్ శర్మ(3) రాణించడంతో 39.5 ఓవర్లలో కేవలం 135 పరుగులు సాధించిన మిడిలెక్స్ ఆలౌటైంది. దీంతో టీమిండియా విజయం సాధించింది

  • Loading...

More Telugu News