: జూడాలతో వైద్య మంత్రి చర్చలు సఫలం
తమ భవనాలు తమకే కేటాయించాలని సమ్మెకు దిగిన జూనియర్ డాక్టర్లతో ఆంధ్రప్రదేశ్ వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. జీవో 78ను రద్దు చేసి స్విమ్స్‌కు బదలాయించిన భవనాలు మెటర్నిటి విభాగానికి తిరిగి ఇవ్వడానికి మంత్రి సూత్రప్రాయంగా అంగీకరించారు. దీంతో సమ్మె విరమణకు జూడాలు సమ్మతించారు.