: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలతో సమావేశమైన జగన్
హైదరాబాదు లోటస్ పాండ్ లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలతో జగన్ సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో శనివారం అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చిస్తున్నారు. టీడీపీ సభ్యులను బఫూన్ అంటూ జగన్ వ్యాఖ్యానించడంతో ఇవాళ సభలో దుమారం రేగిన సంగతి తెలిసిందే. బఫూన్ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలంటూ ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు జగన్ కు సూచించారు. టీడీపీ సభ్యులు క్షమాపణలు చెబితే... తానూ క్షమాపణ చెబుతానంటూ జగన్ వారితో అన్నారు.