: ఐఐటీలు బాధ్యత వహించాలి: రాష్ట్రపతి


నాణ్యమైన విద్యను అందించేందుకు ఐఐటీలు మార్గదర్శకం కావాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సూచించారు. రాష్ట్రపతి భవన్లో ఐఐటీ బోర్డు అధ్యక్షులతో సమావేశమైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో విద్య సమగ్రంగా అందేలా చర్యలు తీసుకోవడానికి ఐఐటీలు ప్రణాళికలు రచించాలని కోరారు. విద్యలో నాణ్యత పెరిగితే భారతదేశం మానవ వనరుల్లో విశిష్టమైన శక్తిగా అవతరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందుకోసం సత్వరమే చర్యలు చేపట్టాలని ఆయన ఐఐటీ బోర్డు అధ్యక్షులకు సూచించారు. మన శక్తి సామర్ధ్యాలతో పూర్తి స్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో శాటిలైట్ లు రూపొందించి, అంతరిక్షంలో ప్రవేశపెట్టగలిగిన నాడు భారత్ పూర్తి ఫలితాలను సాధిస్తుందని ఆయన పేర్కొన్నారు. అందుకు నాణ్యమైన విద్యే పరిష్కారమని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News