: సినీ ప్రముఖులతో గంటా భేటీ
తెలుగు సినీ రంగ ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు సమావేశమయ్యారు. రాష్ట్ర విభజనతో టాలీవుడ్ విశాఖకు తరలి వెళ్తుందని గతంలో పలు సందర్భాల్లో పుకార్లు షికారు చేశాయి. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు వేల ఎకరాలతో సినీ ప్రపంచాన్ని (సినీ సిటీ) కొత్తగా నిర్మిస్తానని చెప్పడంతో సినీ ప్రముఖులంతా తెలంగాణ ప్రభుత్వ ప్రకటన పట్ల ఆసక్తి చూపారు. తాజాగా సినీ ప్రముఖులు ఏపీ మంత్రితో సమావేశమై ఆంధ్రప్రదేశ్ లో సినీ పరిశ్రమ విస్తరింపజేయడంపై సమాలోచనలు చేయడం విశేషం.