: నోట్ బుక్స్ కొనుక్కోవడానికి వెళ్లి తప్పిపోయిన బాలిక


నోట్ బుక్స్ కొనుక్కోవడానికి వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి రాలేదు. హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లా పంచశీల్ ప్రాంతంలో పదోతరగతి చదవుతున్న 14 ఏళ్ల మైనర్ బాలిక నోట్ పుస్తకాలు కొనుక్కునేందుకు దగ్గర్లోని స్టేషనరీ షాప్ కు వెళ్లింది. ఆ బాలిక తిరిగి ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల గాలించారు. అయినా ఆమె ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News