: రక్షణ, ఆరోగ్యానికి సంబంధించిన ఉత్పత్తులను అభివృద్ధి చేయండి: ఐఐటీలను కోరిన మోడీ
పలు రంగాల వస్తువుల దిగుమతులపై భారతదేశం ఆధారపడిన నేపథ్యంలో రక్షణ, ఆరోగ్యానికి సంబంధించిన కొత్త ఉత్పత్తులను అభివృద్ధి చేయాలని దేశంలోని ఐఐటీలను ప్రధానమంత్రి నరేంద్రమోడీ కోరారు. సవాల్ గా తీసుకుని ఈ క్లిష్టమైన రంగాల్లో కృషి చేయాలని ఆయన చెప్పారు. న్యూఢిల్లీలోని గవర్నర్ల బోర్డు ఛైర్మన్లు, ఐఐటీ డైరెక్టర్లు సమావేశంలో ఆయన ప్రసంగించారు. సమర్ధులైన పలువురు యువ ఐఐటీల్లో దేశానికి సేవ చేసే మార్గంలో భాగంగా వారిలో స్ఫూర్తిని నింపాలని ప్రధాని చెప్పారు.