: తెలంగాణ ప్రజలు బీజేపీని ఆదరించారు: అమిత్ షా
తెలంగాణలో భారతీయ జనతాపార్టీకి 23 శాతం ఓట్లు రావడం సామాన్యమైన విషయం కాదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. హైదరాబాదులో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తెలంగాణలో బీజేపీకి 23 శాతం ఓట్లు వచ్చాయని ఆయన చెప్పారు. యూపీ కంటే తెలంగాణ ప్రజలే బీజేపీని ఎక్కువగా ఆదరించారని ఆయన చెప్పారు. తెలంగాణలో బీజేపీని మరింత బలోపేతం చేస్తామని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమే తెలుగు ప్రజలను విభజించిందన్నారు. ఇరు ప్రాంతాల మధ్య సయోధ్య కుదర్చకుండానే విభజించారని అమిత్ షా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ నిరంతరం రాజకీయాలు చేసిందని ఆయన అన్నారు. ప్రజల మనోభావాలు తెలుసుకొనే ప్రయత్నం చేయకుండా, విభజించారన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి భారత్ కు విముక్తి కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు.