: కొనసాగుతున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పంపిణీ ప్రక్రియ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. రాహుల్ బొజ్జా, టీటీడీ ఈవో గోపాల్, అజయ్ మిశ్రా, రాజేశ్వర్ తివారీ, వీణా ఈస్, ఏకే పరీడా, అనిల్ సింఘాల్, జేఎస్వీ ప్రసాద్ లను తెలంగాణ రాష్ట్రానికి కేటాయించారు. ఎస్ఎన్ మహంతి, శ్వేత, అజయ్ జైన్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించారు. రాజీవ్ శర్మ, స్మితా సబర్వాల్ లను తెలంగాణకే కేటాయించారు. సతీష్ చంద్రను ఏపీకి కేటాయించారు.