: నందిగామ శాసనసభ టీడీపీ అభ్యర్థిగా తంగిరాల సౌమ్య నామినేషన్
కృష్ణాజిల్లా నందిగామ నియోజకవర్గానికి జరగనున్న ఉపఎన్నికకు టీడీపీ అభ్యర్థిగా దివంగత తంగిరాల ప్రభాకర్ కుమార్తె తంగిరాల సౌమ్య నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక టీడీపీ కార్యాలయం నుంచి భారీగా పార్టీ నేతలు, కార్యకర్తలతో కలసి ర్యాలీగా వెళ్లిన సౌమ్య తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఇటీవల హఠాన్మరణంతో నందిగామ శాసనసభకు ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. వచ్చేనెలలో ఎన్నిక జరగనుంది.