: ఢిల్లీలో ప్రత్యూష్ సిన్హా కమిటీ భేటీ
ఢిల్లీలోని హోంశాఖ కార్యాలయంలో ప్రత్యూష్ సిన్హా కమిటీ భేటీ అయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎస్ లు, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన అఖిల భారత సేవల (సివిల్ సర్వీసెస్) ఉద్యోగుల విభజనపై తుది కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే లాటరీ పద్ధతిలో రెండు రాష్ట్రాలకు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఉద్యోగులను కేటాయించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.