: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఏదైనా జరిగితే బాబుదే బాధ్యత: కోటంరెడ్డి


ప్రతీ రోజు... ప్రతీ నియోజక వర్గంలో వైసీపీ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయన్నారు కోటంరెడ్డి. దాడి చేసిన వారిపై కేసులు పెడదామని వైసీపీ కార్యకర్తలు వెళితే... పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదు చేసుకోవడం లేదని ఆయన ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రాణాపాయం ఉందని... ఆయనకు ఏదైనా ప్రాణహాని జరిగితే దానికి చంద్రబాబే బాధ్యత వహించాలని కోటం రెడ్డి డిమాండ్ చేశారు. వైసీపీ కార్యకర్తల నెత్తిపై బాంబులు పెట్టి మరీ టీడీపీ కార్యకర్తలు హత్యచేశారని ఆయన ఆవేశంగా అన్నారు.

  • Loading...

More Telugu News