: లోక్ సభలో ప్రతిపక్ష హోదాపై వివరణ ఇవ్వాలంటూ కేంద్రానికి నోటీసులు


లోక్ సభలో ప్రతిపక్ష హోదాపై నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ప్రతిపక్షం లేకుండా ఎలా పని చేస్తారని కోర్టు ప్రశ్నించింది. లోక్ పాల్ కమిటీ నియామకానికి ప్రతిపక్షం చాలా ప్రధానమని పేర్కొంది. న్యాయవాది, ఏఏపీ నేత ప్రశాంత్ భూషణ్ ఈ అంశాన్ని పిటిషన్ రూపంలో న్యాయస్థానం ముందుకు తీసుకొచ్చిన నేపథ్యంలో కోర్టు పైవిధంగా స్పందించింది. కాగా, సభలో ప్రతిపక్ష హోదా కోరిన కాంగ్రెస్ ను లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ నాలుగు రోజుల కిందట తిరస్కరించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News