: రూ. లక్ష లోపు పంట రుణాలకు వడ్డీ రాయితీ: మంత్రి ప్రత్తిపాటి
ఆంధ్రప్రదేశ్ లో రైతులకు రూ.లక్ష లోపు పంట రుణాలకు పూర్తి వడ్డీ రాయితీ వర్తిస్తుందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఇక రైతులకు రూ.3 లక్షల వరకు పావలా వడ్డీకే రుణాలు మంజూరు చేస్తామని శాసనసభలో వ్యవసాయ బడ్జెట్ సందర్భంగా ప్రకటించారు. సకాలంలో రుణాలు తిరిగి చెల్లించిన వారికే పావలావడ్డీ వర్తిస్తుందని వివరించారు. రానున్న రోజుల్లో వ్యవసాయ ఉత్పత్తులు మరింత పెంచుతామని హామీ ఇచ్చిన మంత్రి... ముఖ్య పంటల ఉత్పాదకత పెరిగేలా చర్యలు చేపడతామన్నారు. ఏపీలో వ్యవసాయ రుణాల మాఫీకి అంగీకరించినందుకు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.