: ‘కౌమ్ కె హీరే’(జాతి వజ్రాలు) చిత్రం రిలీజ్ కు బ్రేక్ వేసిన కేంద్రం
దివంగత భారతదేశ మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్య ఆధారంగా పంజాబీలో నిర్మించిన ‘కౌమ్ కె హీరే’(జాతి వజ్రాలు) చిత్రం విడుదలకు కేంద్రం అడ్డుతగిలింది. ‘కౌమ్ కె హీరే’ చిత్రంలో వివాదాస్పద అంశాలున్నాయని... ఈ చిత్రం విడుదలైతే మతకల్లోలాలు చెలరేగే అవకాశం ఉందని... ఈ కారణంగా ఈ చిత్రం విడుదలను ఆపుతున్నట్టు కేంద్రం ప్రకటించింది. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్, బీజేపీలు ఈ చిత్రం విడుదల కాకుండా ఆపాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ప్రతీ విషయంలోను భిన్నధృవాలుగా ఉండే కాంగ్రెస్, భాజపాలు ఈ చిత్రం విషయంలో మాత్రం ఒకే అభిప్రాయం కలిగిఉండడం విశేషం.