: ఏపీ అసెంబ్లీలో నేడు వ్యవసాయ బడ్జెట్


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెడుతోంది. శాసనసభలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు బడ్జెట్ ప్రవేశపెడతారు. అలాగే, శాసనమండలిలో మంత్రి దేవినేని ఉమ బడ్జెట్ వివరాలను చదువుతారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు సంబంధించి రూ. 14 వేల కోట్లతో ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రైతు రుణమాఫీ కోసం రూ. 5 వేల కోట్లను కేటాయించినట్టు తెలుస్తోంది. వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులు, యాంత్రీకరణ తదితర అంశాలకు బడ్జెట్ లో పెద్దపీట వేసినట్టు తెలుస్తోంది. బిందు సేద్యం, విత్తనాల అభివృద్ధి సంస్థలు, ఇక్రిశాట్ తో ఒప్పందాలకు బడ్జెట్ లో ప్రాధాన్యత కల్పించినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News