: తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు ఏంటో తెలుసా?
నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు ఖరారయ్యాయి. తెలంగాణ రాష్ట్ర జంతువుగా అడవిదున్నను ఖరారు చేశారు. ఇంగ్లిష్ లో అడవిదున్నను ఇండియన్ బైసన్ అని పిలుస్తారు. అలాగే రాష్ట్ర చెట్టుగా ఇప్పచెట్టును నిర్ణయించారు. రాష్ట్ర పుష్పంగా మోదుగుపువ్వును ఖరారు చేశారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర పక్షిగా పాలపిట్ట (ఇండియన్ రోలర్) ఖరారయ్యింది. రాష్ట్ర చిహ్నాలకు సంబంధించిన దస్త్రంపై అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగురామన్న గురువారం సంతకం చేసి... ఫైలును సీఎం కేసీఆర్ ఆఫీసుకు పంపించారు. ఈ ఫైలు ప్రస్తుతం సీఎం కార్యాలయంలో ఉంది. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్కు తిరిగి వచ్చిన వెంటనే వీటిని అధికారికంగా ప్రకటించనున్నారు.