: 2019లో తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యం: అమిత్ షా
హైదరాబాద్ పర్యటనకు విచ్చేసిన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా... తన రాక వెనకున్న ఉద్దేశమేంటో స్పష్టం చేశారు. 2019లో జరిగే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జయభేరి మోగించాలని... తెలంగాణ అధికార పీఠంపై కూర్చోవడమే మన లక్ష్యమని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దక్షిణాదిన బీజేపీ విస్తరణకు తెలంగాణనే నాయకత్వం వహించాలని అన్నారు. తెలంగాణలో ప్రతి గ్రామానికీ బీజేపీ చేరేలా నేతలు, కార్యకర్తలు ఇప్పట్నుంచే శ్రమించాలని అమిత్ షా మార్గనిర్దేశం చేశారు. 2014లో కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఉత్తర, మధ్య భారతదేశ పాత్ర కీలకమైనదని... 2019 ఎన్నికల్లో తూర్పు, దక్షిణ భారతదేశం బీజేపీని అధికార పీఠంపై కూర్చోబెట్టడానికి అండగా నిలవాలని చెప్పారు.