: ప్రధాని మోడీతో గవర్నర్ నరసింహన్ భేటీ నేడే
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు వీరు సమావేశమవుతారు. నిన్ననే వీరి భేటీ జరగాల్సి ఉన్నప్పటికీ... మహారాష్ట్ర, జార్ఖండ్ పర్యటనల్లో ప్రధాని ఉండటంతో వీలుకాలేదు. ఈ రోజు జరగనున్న భేటీలో... ఇరు రాష్ట్రాల తాజా పరిస్థితులను మోడీకి నరసింహన్ వివరించనున్నారు. దీనికితోడు హైదరాబాద్ శాంతిభద్రతలు, ఐఏఎస్ అధికారుల క్యాడర్ వర్గీకరణపై చర్చించనున్నారు. అయితే, నిన్న సాయంత్రం నరసింహన్ కాసేపు ప్రధాని కార్యాలయానికి వెళ్లి అక్కడి అధికారులతో ముచ్చటించారు.