: రెండు, మూడు నెలలకే మోడీ పాలనను అంచనా వేయలేం: పవన్ కల్యాణ్
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. పలు విషయాలపై వీరిద్దరూ చర్చించినట్టు సమాచారం. భవిష్యత్ కార్యాచరణ కూడా వీరిద్దరి మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. అనంతరం పవన్ మాట్లాడుతూ, కేవలం మర్యాద పూర్వకంగానే షాను కలిశానని తెలిపారు. రెండు, మూడు నెలలకే మోడీ పాలనను అంచనా వేయలేమని చెప్పారు. మార్పులు తీసుకు రావడానికి కొంత సమయం పడుతుందని అన్నారు.