: హైదరాబాదులో పలు ప్రాంతాల్లో వర్షం


హైదరాబాదులోని పలు ప్రాంతాల్లో వర్షపు జల్లులు పడుతున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షం కురుస్తోంది. ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్ పేట; ఎర్రగడ్డ, కూకట్ పల్లి తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గురువారం ఉదయం నుంచి నగరంలో ఎండ తీవ్రతకు ఉక్కపోతతో నగరవాసులు అల్లాడిపోయారు. ఈ వర్షానికి వాతావరణం చల్లబడటంతో వారికి ఉపశమనం లభించింది.

  • Loading...

More Telugu News