: పవన్ కల్యాణ్ తో సమావేశమవుతున్న అమిత్ షా!
సినీ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమావేశం కానున్నారు. రెండు రోజుల పాటు హైదరాబాదులో పర్యటిస్తున్న అమిత్ షా... రాత్రి 9.45 గంటలకు హోటల్ లో పవన్ కల్యాణ్ తో సమావేశమవుతున్నారు. ఈ భేటీతో విశాఖ ఎంపీ హరిబాబు కూడా పాల్గొంటారు. ఇటీవలి ఎన్నికల్లో పవన్ కల్యాణ్ టీడీపీ-బీజేపీ పార్టీలకు మద్దతుగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ప్రచార సభలకు ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో సుడిగాలి పర్యటన చేసి టీడీపీ-బీజేపీ పార్టీలను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రముఖ పాత్ర పోషించారు. ఇప్పుడు జాతీయ అధ్యక్షునిగా ఎన్నికైన అనంతరం అమిత్ షా తొలిసారిగా హైదరాబాదు పర్యటనకు వచ్చిన నేపథ్యంలో... ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.