: హైదరాబాదులో 70 ఏళ్ల మహిళపై అత్యాచారం


రేపిస్టులకు వయసు తారతమ్యాలు, వావి వరసలు కనిపించడం లేదు. తల్లిలాంటి మహిళను ఓ కామాంధుడు చెరిచాడు. 19వ తేదీన హైదరాబాదు నుంచి రంగారెడ్డి జిల్లా వికారాబాదులోని బంధువుల ఇంటికి మహిళ వెళ్లింది. ఆ ఇంటికి వంట పని చేసేందుకు వచ్చిన ముజాహిద్(20) అనే యువకుడు 70 ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విషయం ఆలస్యంగా వెలుగు చూడడంతో కేసు నమోదు చేసిన పోలీసులు, ఆ యువకుడ్ని అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. నిందితుడికి జ్యూడిషియల్ రిమాండ్ విధించగా, బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

  • Loading...

More Telugu News