: సెప్టెంబరు 17న తెలంగాణ వికాస దినం నిర్వహిస్తాం: అమిత్ షా
హైదరాబాదు సంస్థానాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాం కబంధ హస్తాల నుంచి విముక్తి చేసి భారత్ యూనియన్ లో విలీనం చేశారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. సెప్టెంబరు 17వ తేదీన ‘తెలంగాణ వికాస దినం’ను నిర్వహిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. 2019లో కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి రావాలంటే దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ సత్తా చాటాలని అమిత్ షా చెప్పారు.