: ‘క్లీన్ అండ్ గ్రీన్ సిటీ’కి ఇప్పుడు మురికి అంటుతోంది: కిషన్ రెడ్డి
మజ్లిస్ కారణంగా అభివృద్ధిలో హైదరాబాదు వెనుకబడిపోతోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. గతంలో హైదరాబాదుకు క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా అవార్డు వచ్చిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అయితే, ఇప్పుడు మజ్లిస్ పాలనతో నగరానికి మురికి అంటుకుందని ఆయన అన్నారు. సికింద్రాబాదులో జరిగిన గ్రేటర్ హైదరాబాదు బీజేపీ నేతల సమావేశంలో కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పాల్గొన్న సంగతి తెలిసిందే. కులమతాలకు అతీతంగా బీజేపీ పనిచేస్తుందని బీజేపీ సీనియర్ నేత మురళీధరరావు అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సన్మాన కార్యక్రమంలో మాట్లాడుతూ... మజ్లిస్ ఆగడాలను బీజేపీ అడ్డుకుంటుందని అన్నారు. హైదరాబాదు జాతీయ సమగ్రతకు చిహ్నమని మురళీధరరావు పేర్కొన్నారు.