: దొంగలు బాబోయ్ దొంగలు... టైరు పంక్చరైందని చెప్పి దోచేశారు


తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దొంగలు స్వైర విహారం చేస్తున్నారు. కంటబడితే చాలు దోచుకుని వెళ్లిపోతున్నారు. బ్యాంకులు, ఏటీఎంల వద్ద కాపలా కుక్కల్లా కాపు కాసి, వెంటపడి, దృష్టి మరల్చి సొమ్ము లాక్కుపోతున్నారు. హైదరాబాద్ చైతన్యపురి ఎస్బీఐ బ్యాంకు సమీపంలో గురుశంకర్ నుంచి 9 లక్షలు లూటీ చేయగా, గుంటూరు జిల్లా తెనాలి గంగనమ్మపేటలో మరోదారుణం చోటు చేసుకుంది. పంజాబ్ నేషనల్ నుంచి 8 లక్షల రూపాయలు డ్రా చేసి బైకుపై వెళుతుండగా టైరు పంక్చరైంది. దీంతో మెకానిక్ షాపుకు వెళ్లి పంక్చర్ వేయించుకుని తిరిగొచ్చేసరికి డబ్బు సంచి మాయమైంది. దీంతో లబోదిబో మంటూ బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News