: ఏవియేషన్ అకాడమీ పేరు మారింది
ఏవియేషన్ అకాడమీ పేరు మారింది. తెలంగాణ ఏవియేషన్ అకాడమీగా పేరు మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అకాడమీ కార్యకలాపాల పర్యవేక్షణకు ఓ కమిటీని ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఈ కమిటీ పనిచేస్తుంది. రాష్ట్ర విభజన అనంతరం ఒక్కో ప్రభుత్వ సంస్థ పేరును మారుస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏవియేషన్ అకాడమీ పేరూ మారింది.