: అమీర్ ఖాన్ పై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశం


'పీకే' చిత్రానికి సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ లో న్యూడ్ గా కనిపించినందుకుగాను బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ సమస్యల్లో చిక్కుకున్నారు. ఈ మేరకు న్యాయవాది అమిత్ సాహు ఫిర్యాదు ఆధారంగా అమీర్ పై కేసు నమోదు చేయాలని మధ్యప్రదేశ్ లోని జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ ఆర్ డీ దెహరియా అధర్తల్ పోలీస్ స్టేషన్ ఇన్ ఛార్జిని ఆదేశించారు. అంతేగాక 'పీకే' చిత్రం దర్శక, నిర్మాతలు రాజు హిరాణి, విధు వినోద్ చోప్రా, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రొడ్యూసర్ గిల్డ్ ప్రెసిడెంట్, నిర్మాత ముకేశ్ భట్, పోస్టర్ ను పబ్లిష్ చేసిన మూడు స్థానిక పత్రికల ఎడిటర్, పబ్లిషర్లపై కూడా కేసు నమోదు చేయనున్నారు.

  • Loading...

More Telugu News