: సరిహద్దు ఘర్షణలు చల్లార్చేందుకు కేంద్రం చర్యలు
అసోం, నాగాలాండ్ ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో ఏర్పడిన సరిహద్దు ఘర్షణలను చల్లార్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. అసోం, నాగాలాండ్ ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి సమావేశమయ్యారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి కీలక ఒప్పందం చేసుకున్నారు. రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరు సభ్యులతో సరిహద్దు శాంతి సంఘం ఏర్పాటు చేశారు. వీరు సరిహద్దులపై, ఘర్షణలపై ప్రభుత్వానికి పూర్తి సమాచారమిస్తారు. అలాగే అల్లర్లు చల్లారేందుకు చేపట్టాల్సిన చర్యలను కూడా సూచిస్తారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి తెలిపారు.