: కృష్ణాజిల్లా గుడివాడలో దోపిడీ దొంగల బీభత్సం
కృష్ణాజిల్లా గుడివాడలో దోపిడీ దొంగలు తెగబడ్డారు. ఏటీఎం సిబ్బంది కళ్లల్లో కారం కొట్టి రూ.11 లక్షలను దోచుకెళ్లారు. ఏటీఎంలో సిబ్బంది డబ్బు నింపుతుండగా ఈ ఘటన జరిగింది. వెంటనే ఘటనపై పోలీసులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది.