: హైదరాబాదులో అడుగుపెట్టిన అమిత్ షా


భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాదు నగరానికి చేరుకున్నారు. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఆయనకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం అమిత్ షా తొలిసారిగా తెలంగాణ రాష్ట్రానికి రావడంతో పార్టీ నేతలు బండారు దత్తాత్రేయ, ఇంద్రసేనారెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి సహా పలువురు కార్యకర్తలు ఆయనకు సాదరంగా ఆహ్వానం పలికారు. కాసేపట్లో సికింద్రాబాదులో గ్రేటర్ హైదరాబాదు బీజేపీ నేతలతో అమిత్ షా సమావేశమవుతున్నారు. రాత్రి తెలంగాణ బీజేపీ పదాధికారులతో ఆయన భేటీ కానున్నారు. సమావేశ ఏర్పాట్లను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

  • Loading...

More Telugu News