: హైదరాబాదులో పగలు ఎండ వేడి... రాత్రి వాన జోరు
హైదరాబాదులో వింత వాతావరణం నెలకొంది. ఇటీవల కాలంలో ఒకే రోజు మూడు రుతువులు వస్తున్న ఫీలింగ్ నగరవాసులకు కలుగుతోంది. బుధవారం నాడు ఉదయం చలి, పగలు ఎండతో ఉక్కపోతతో అల్లాడిపోయిన నగరవాసులకు రాత్రి కురిసిన వర్షానికి వాతావరణం చల్లబడింది. గత వారం రోజులుగా పగటి పూట ఉష్ణోగ్రతలు వేసవిని తలపిస్తున్నాయి. మధ్య మధ్యలో వానజల్లులు పడుతున్నా వాతావరణంలో వేడి మాత్రం తగ్గడం లేదు. ఎండకు తోడు చెమట విపరీతంగా పడుతోంది. గతంలో ఎంత ఎండగా ఉన్నా ఉక్కపోత మాత్రం తక్కువే. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. సముద్ర తీర ప్రాంతాలైన విశాఖ, మచిలీపట్నంలో మాదిరి చెమటలు పడుతుండటం నగరవాసులకు అనుభవంలోకి వచ్చింది.