: సల్లూభాయ్ స్నేహానికి పరీక్ష పెట్టిన అమీర్ ఖాన్


బాలీవుడ్ ఖాన్ ద్వయం సల్మాన్, అమీర్ మంచి మిత్రులన్న సంగతి తెలిసిందే. అమీర్ ఖాన్ సినిమాలను కుదిరినప్పుడల్లా సల్లూభాయ్ ప్రమోట్ చేస్తుంటాడు. బిగ్ బాస్ సీజన్ 7లో ధూమ్-3 ప్రమోషన్ ను సినిమాలో అమీర్ ధరించిన టోపీతో పూర్తి చేశాడు. తాజాగా సల్మాన్ వ్యాఖ్యాతగా బిగ్ బాస్ 8 ప్రసారం ప్రారంభం కానుంది. అలాగే అమీర్ ఖాన్ 'పీకే' సినిమా విడుదల కూడా బిగ్ బాస్ నడుస్తున్నప్పుడే జరుగనుంది. ఈసారి ‘బిగ్ బాస్’లో సల్మాన్ ప్రచారం గురించి అమీర్ మాట్లాడుతూ, ధూమ్-3 కి తన టోపీ ధరించి సల్మాన్ ప్రచారం చేశాడు. ఈసారి పీకే ప్రచారం కోసం న్యూడ్ గా మారితే చూడాలనుందని అన్నాడు. సల్మాన్ స్నేహానికి ఇదొక పరీక్ష అని... ఇంతవరకు సల్లూ షర్ట్ విప్పితే చూశామని, ప్యాంట్ కూడా విప్పితే చూడాలనుందని అమీర్ కోరాడు. మరి సల్లూభాయ్ చేస్తాడా? స్నేహితుడి కోరిక ఎలా తీరుస్తాడో చూడాలి మరి.

  • Loading...

More Telugu News