: ముంబైని ముంచెత్తిన వాన
ఉత్తరాదిన వర్షాలు దంచి కొడుతున్నాయి. ముంబై నగరాన్ని వాన ముంచెత్తింది. నాన్ స్టాప్ గా కురుస్తున్న వర్షాలకు ముంబై రోడ్లపై మోకాళ్ల లోతు నీరు నిలిచింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరవాసులు తడుస్తూనే ఇళ్లకు చేరుకుంటున్నారు. ఇవాళ ఉదయం నుంచి వాన కురుస్తూనే ఉందని ముంబై వాసులు చెప్పారు. వాన పడిన ప్రతిసారీ ఇలాగే రోడ్లపై నిలుస్తోందని, అయినా కార్పొరేషన్ డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం లేదని వారు ఆరోపించారు.