: మోడీ చెప్పిన దానికి పూర్తి వ్యతిరేకంగా వ్యవహరించిన కేంద్ర ఆరోగ్యమంత్రి


దేశంలో అవినీతి కేన్సర్ లాగా పెరిగిపోతోందని... ప్రజల సాయంతో అవినీతి భూతాన్ని అరికడతానని... నిజాయతీ కలిగిన అధికారులతోనే దేశ అభివృద్ధి సాధ్యమని మోడీ ప్రకటించిన 24 గంటల్లోపే... దానికి పూర్తి వ్యతిరేకంగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ ప్రవర్తించారు. ఎయిమ్స్ లో రెండేళ్లుగా చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ గా పనిచేస్తూ...'అవుట్ స్టాండింగ్ ఆఫీసర్'గా పేరు తెచ్చుకున్న సంజీవ్ చతుర్వేదిని హర్షవర్థన్ ఆ పదవి నుంచి తొలగించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. కేంద్రంలో నిజాయతీ కలిగిన ఆఫీసర్ గా సంజీవ్ చతుర్వేదికి ఎంతో పేరుంది. ఎయిమ్స్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టి ఆయన రెండేళ్లయింది. ఈ రెండేళ్లలో ఎయిమ్స్ లో ఎన్నో కుంభకోణాలను, అవినీతి భాగోతాలను ఆయన వెలికితీశారు. ఆయన మూలంగానే ఎయిమ్స్ ఇటీవల కాలంలో సక్రమంగా... ఎటువంటి అక్రమాలు లేకుండా నడుస్తోంది. వాస్తవంగా సంజీవ్ చతుర్వేది నాలుగేళ్ల పాటు ఎయిమ్స్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ గా నియమితులయ్యారు. అయితే రెండేళ్లకే ఆయనను హర్షవర్థన్ రాణే సాగనంపారు. ఆయనను సాగనంపాలని యుపీఏ ప్రభుత్వంపై కూడా చాలా ఒత్తిడులు వచ్చాయి. అయితే అప్పట్లో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సంజీవ్ చతుర్వేది బదిలీని తీవ్రంగా వ్యతిరేకంచడంతో కుదరలేదు. కేంద్ర ఆరోగ్య శాఖ గతంలో చాలాసార్లు సంజయ్ చతుర్వేది పనితీరు అత్యద్భుతమని కితాబిచ్చింది. ఇంత నిజాయతీ కలిగిన అధికారిని ఎయిమ్స్ సంస్థ నుంచి తప్పించడంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

  • Loading...

More Telugu News