: ఐదు గ్రిడ్ల ఏర్పాటే లక్ష్యం: చంద్రబాబు


రాష్ట్ర అభివృద్ధి కోసం ఐదు గ్రిడ్లను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఇందులో వాటర్ గ్రిడ్, రోడ్స్ గ్రిడ్, పవర్ గ్రిడ్, గ్యాస్ గ్రిడ్, ఫైబర్ ఆప్టిక్ గ్రిడ్ ఉంటాయని చెప్పారు. వీటి ఏర్పాటును లక్ష్యంగా పెట్టుకుందామని టీడీపీ నేతల వర్క్ షాప్ లో ఆయన తెలిపారు. పేదరికంపై గెలుపు, పొలం పిలుస్తోంది, బడి పిలుస్తోంది, నీరు-చెట్టు కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. నూరు శాతం అక్షరాస్యతను సాధించడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. తలసరి ఆదాయం రూ. 2 లక్షలకు పెరిగేలా చర్యలు తీసుకుందామని చెప్పారు.

  • Loading...

More Telugu News