: కొలీజియం వ్యవస్థ రద్దుపై కోర్టులో పిటిషన్లు


దేశంలో జడ్జిల నియామకం, బదిలీలకు సంబంధించిన కొలీజియం వ్యవస్థ రద్దును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో గురువారం పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ఈనెల 25న కోర్టు విచారణ చేపట్టనుంది. కొలీజయంలో అవినీతి చోటుచేసుకుందంటూ ఇటీవల జస్టిస్ మార్కండేయ కట్జూ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొలీజియంను రద్దు చేసింది. దాని స్థానంలో ఏడుగురు సభ్యులతో కూడిన న్యాయమూర్తుల నియామక కమిటీని తీసుకొచ్చి పార్లమెంటులో బిల్లును ఆమోదింపజేసింది.

  • Loading...

More Telugu News