: గోవాలో శ్రీరామ్ సేనపై బ్యాన్


హిందూ మత వ్యాప్తికి కృషి చేస్తున్న శ్రీరామ్ సేనపై గోవా ప్రభుత్వం బ్యాన్ విధించింది. ఈ మేరకు సేన తమ బ్రాంచ్ ను రాష్ట్రంలో ఏర్పాటు చేయనుండడాన్ని క్యాన్సిల్ చేస్తున్నట్లు రాష్ట్ర శాసనసభకు ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. ఈ క్రమంలో రాష్ట్రంలో సేన ఎంట్రీకి సంబంధించిన అంశంపై నివేదిక తయారు చేయాలని పోలీసులకు చెప్పానని, దాన్ని కలెక్టర్ కు పంపి అర్హత రద్దు చేయాలని వివరించినట్లు చెప్పారు. కాగా, సెప్టెంబర్ లో గోవాలో తమ బ్రాంచ్ ను ఏర్పాటు చేయబోతున్నట్లు సేన అధినేత ప్రమోద్ ముథాలిక్ ప్రకటించారు. అంతేకాదు ఆ రాష్ట్రంలో క్లబ్బులు, పబ్బులు, పాశ్చాత్య సంస్కృతిని అదుపులో పెట్టాలనుకుంటున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో గోవాలో సేన ప్రవేశిస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రభుత్వం ఆలోచించింది. అందుకే శ్రీరామ్ సేనను రాష్ట్రంలో ప్రవేశించేందుకు వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది.

  • Loading...

More Telugu News