: తుపాకీ మిస్ ఫైర్... మహిళా రైతు తలలోకి దూసుకెళ్లిన బుల్లెట్
తుపాకీ మిస్ ఫైర్ అవడంతో బుల్లెట్ ఓ మహిళ తల్లోకి దూసుకెళ్లిన ఘటన మెదక్ జిల్లా పుల్కల్ మండలం న్యూఉమ్నాపూర్ లో జరిగింది. ఉమ్నాపూర్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ బీహెచ్ఈఎల్ యూనిట్ ఆధ్వర్యంలో పోలీస్ ట్రైనింగ్ జరుగుతోంది. శిక్షణలో ప్రమాదవశాత్తు తుపాకి పేలడంతో కొంతదూరంలో వెళుతున్న చంద్రకళ(48) అనే మహిళా రైతు తలకు బుల్లెట్ తగిలింది. వెంటనే ఆమెకు దగ్గరలోని ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం హైదరాబాదు తరలించి యశోదా ఆసుపత్రిలో చేర్పించారు.