: అందరూ తమ పెరట్లోనే రాజధాని అంటే ఎలా?: మంత్రి బొజ్జల
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై వస్తున్న డిమాండ్లపై మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి స్పందించారు. ప్రతి ఒక్కరూ తమ పెరట్లోనే రాజధాని ఉండేలా ఆలోచిస్తున్నారన్నారు. భూముల లభ్యత, అన్ని ప్రాంతాలకు అనువైన చోటే రాజధాని ఏర్పాటవుతుందని చెప్పారు. గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం మాదల గ్రామంలో మొక్కలునాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పైవిధంగా మాట్లాడారు.