: ఆనం సోదరులతో నారా లోకేశ్ మాట్లాడారా?
మాజీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి, ఆయన సోదరుడు ఆనం వివేకానందరెడ్డిలకు టీడీపీలో బెర్త్ ఖాయమయినట్టే కనిపిస్తోంది. సోదరులిద్దరూ నాలుగు రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ కూడా అయ్యారు. అనంతరం వీరిద్దరి బాధ్యతనూ యువనేత లోకేశ్ కు అప్పజెప్పారు చంద్రబాబు. ఈ క్రమంలో ఆనం సోదరులతో లోకేశ్ ఫోనులో సంభాషించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నెల 24న చంద్రబాబు నెల్లూరులో పర్యటించనున్నారు. ఈ లోగానే ఆనం సోదరుల వ్యవహారాన్ని తేల్చే పనిలో లోకేశ్ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, ఆనం సోదరులు టీడీపీలో చేరితే జిల్లా పార్టీలో వారి ఆధిపత్యం పెరిగిపోతుందని అదే జిల్లాకు చెందిన మరో నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. ఈ కారణంగానే వీరిద్దరికి చాలా రోజుల పాటు చంద్రబాబు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదు. అయితే, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడి సూచనతో చంద్రబాబు మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది.