: భూక్రమబద్ధీకరణపై సీపీఎం రాఘవులు ఆగ్రహం
భూక్రమబద్ధీకరణ కోసం జారీ చేసిన జీవో 166 పై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు మండిపడ్డారు. ఈ జీవోతో రాజకీయ నేతలకు, భూ కబ్జాదారులకు ప్రభుత్వం సహకరించేందుకు ప్రయత్నిస్తోందని రాఘవులు విమర్శించారు.
జీవో 166తో ఇప్పటి వరకు జరిగిన భూక్రమబద్ధీకరణపై వెంటనే విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు మంత్రి పదవికి రాజీనామా చేశానని చెబుతూనే ధర్మాన ప్రసాదరావు అధికార సౌఖ్యాలు అనుభవిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.