: ఫిలిం చాంబర్ కు సమ్మె నోటీసు
హైదరాబాదులోని ఏపీ ఫిలిం చాంబర్ కు ఫిలిం ఫెడరేషన్ సమ్మె నోటీసు ఇచ్చింది. కార్మికులకు వెంటనే వేతనాలు పెంచాలని ఫెడరేషన్ డిమాండ్ చేసింది. వేతనాలను పెంచకుంటే రేపటి నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించింది. ఫెడరేషన్ లో తెలుగు సినీ రంగానికి చెందిన 24 విభాగాల యూనియన్లు భాగస్వాములుగా ఉన్నాయి.