: కేంద్ర హోం మంత్రితో నేడు భేటీ కానున్న టీఆర్ఎస్ ఎంపీలు


హైదరాబాదుపై గవర్నర్ కు అధికారాలు కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ రాసిన లేఖపై తమ అభ్యంతరాలను తెలియజేసేందుకు... నేడు కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో టీఆర్ఎస్ ఎంపీలు భేటీ అవుతున్నారు. వాస్తవానికి ఈ సమావేశం ఈ నెల 18నే జరగాల్సి ఉంది. కానీ, కొన్ని కారణాల వల్ల ఈ రోజుకు వాయిదా పడింది. ఈ సమావేశంలో టీఆర్ఎస్ ఎంపీలు జితేందర్ రెడ్డి, కవిత, కడియం శ్రీహరి, బాల్క సుమన్, వినోద్ కుమార్ లు పాల్గొంటారు. హైదరాబాద్ పై గవర్నర్ గిరీని బలవంతంగా రుద్దరాదంటూ వీరంతా కలసి రాజ్ నాథ్ కు విజ్ఞప్తి చేయనున్నారు.

  • Loading...

More Telugu News