: మహిళలు అపరకాళికావతారం ఎత్తారు... రౌడీ షీటర్ ను అంతమొందించారు


మహిళలు అపరకాళిక అవతారం ఎత్తారు. ఆ మహిళలు భూమాతంత సహనం చూపినా రౌడీ షీటర్ ఆగడాలకు అడ్డుకట్ట పడకపోవడంతో తమ ఉగ్రరూపం ఎలా ఉంటుందో రుచి చూపించారు. కాకపోతే వారి ఆగ్రహాన్ని తట్టుకోలేకపోయిన రౌడీషీటర్ తరువాత తన బాధ చెప్పుకునేందుకు మిగల్లేదు. కరీంనగర్ జిల్లా కోనారావుపేట మండలం శివగాలపల్లి గ్రామంలో రౌడీషీటర్ శంకర్‌కు తరచూ మహిళలను వేధించడం అలవాటైపోయింది. రోజుకొకర్ని వేధిస్తుండడంతో అతని ఆగడాలను తట్టుకోలేక మహిళలంతా ఒక్కటయ్యారు. మూకుమ్మడిగా శంకర్పై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన రౌడీషీటర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

  • Loading...

More Telugu News