: రేపు హైదరాబాద్ రానున్న అమిత్ షా


బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రేపు (గురువారం) హైదరాబాద్ వస్తున్నారు. బోయిన్ పల్లిలోని ఇంపీరియల్ గార్డెన్స్ లో జరిగే పార్టీ కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొంటారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ రేపటి సమావేశ ఏర్పాట్లను పర్యవేక్షించారు. రానున్న రోజుల్లో అమిత్ షా తెలంగాణ రాష్ట్రంపై దృష్టి సారించనున్నారని... బీజేపీని బలోపేతం చేయడానికి కసరత్తులు మొదలుపెట్టనున్నారని ఇప్పటికే పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News