: గుడిలో దేవతను ఆరాధిస్తారు...బస్సులో మహిళను వేధిస్తారు: రాహుల్ గాంధీ
మన దేశంలో దేవతలను ఆరాధిస్తారు... ఆ వెంటనే బస్సు ఎక్కి మహిళలను వేధిస్తారని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించాడు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, దేశంలో ప్రతి మహిళ ఏదో ఒక సందర్భంలో వేధింపులకు గురైనవారేనని అన్నారు. మహిళా శక్తి నిద్రలేవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన తెలిపారు. మహిళా బిల్లుకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. యూపీఏ ప్రవేశపెట్టిన ప్రతి పథకం సామాన్యుడికి మేలు చేసేదేనని రాహుల్ తెలిపారు.