: గంగా నది ప్రక్షాళనకు మూడేళ్ల లక్ష్యాన్ని పెట్టుకున్న కేంద్రం
మూడు సంవత్సరాల్లో పవిత్ర గంగా నదిని శుభ్రపరచాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి మాట్లాడుతూ, పరిశ్రమలు, మురుగు నుంచి వచ్చి చేరే కాలుష్యాన్ని పరిష్కరించేందుకు దశల వారీగా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఈ మూడేళ్లలో పర్యావరణ ప్రవాహాన్ని (ఈ-ఫ్లో) స్థాపించాలనుకుంటున్నామన్నారు. గంగా నది ఒడ్డున కాలుష్య సమస్యను కూడా పరిష్కరించాలనుకుంటున్నామని భారతి మీడియాకు క్లుప్తంగా చెప్పారు.