: ప్రపంచంలో ఈయనే ‘పెద్దమనిషి’


ప్రపంచంలో అందరికన్నా ‘పెద్దమనిషి’ ఎవరో తెలుసా? జపాన్ వాసి అయిన సకారి మమోయ్. 111 సంవత్సరాల సకారి మమోయ్ శతాధిక వృద్ధుడిగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్నాడు. గతంలో ఈ రికార్డు న్యూయార్క్ కు చెందిన అలెగ్జాండర్ పేరిట ఉండేది. అలెగ్జాండర్ వయస్సు 111 సంవత్సరాల 164 రోజులు. 1903, ఫిబ్రవరి 5న జన్మించిన సకారి మమోయ్ ఆ రికార్డును తుడిచిపెట్టేశాడు. గిన్నీస్ అవార్డును అందుకోవడానికి సకారి మమోయ్ డార్క్ సూట్ ధరించి వీల్ ఛైర్ లో కూర్చుని వచ్చారు. ఐదుగురు కొడుకులతో టోక్నోలో నివసిస్తున్న ఈ ‘పెద్దమనిషి’కి పుస్తకాలన్నా, చైనీస్ కవిత్వం చదవడమన్నా ఎంతో ప్రీతి. మహిళల్లో కూడా ఈ రికార్డు జపాన్ పేరునే ఉండటం విశేషం. 116 ఏళ్ల మిసావ ఓకావో ప్రపంచంలోనే వృద్ధురాలిగా గిన్నీస్ కెక్కారు.

  • Loading...

More Telugu News